మా పాదయాత్రకు అపూర్వ స్పందన: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు

  • అవిశ్వాసంపై చర్చ జరపడానికి అవకాశం లేకుండా పోయింది
  • నలుగురు అడ్డుకుంటే అవిశ్వాసం తిరస్కరించడమేంటి?
  • అందుకే మేము ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగిస్తున్నాం
తాము ఈ రోజు నిర్వహించిన పాదయాత్రకు అపూర్వ స్పందన వచ్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర సర్కారు వైఖరికి నిరసనగా ఈ రోజు సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఏపీలో ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు పాదయాత్రలు చేసిన విషయం తెలిసిందే. పాదయాత్ర ముగిసిన అనంతరం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మధు మాట్లాడుతూ.. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపడానికి అవకాశం లేకుండా పోయిందని, అందుకే తాము ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగిస్తున్నామని తెలిపారు. నలుగురు ఎంపీలు అడ్డుకుంటే అవిశ్వాస తీర్మానంపై చర్చను తిరస్కరించడమేంటని ప్రశ్నించారు. 
Go Back to Shorts
madhu
cpm

More Telugu News